శివతాండవ స్తోత్రం శివతాండవ స్తోత్రానికి మూలం రావణుడు శివుని గొప్ప భక్తుడు, వారిద్దరి గురించి ఎన్నో కధలు ఉన్నాయి. ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు, కానీ రావణుడు గొప్పవాడయ్యాడు. దక్షిణం నుండి ఎంతో దూరం ప్రయాణించి కైలాసానికి చేరుకున్నాడు – అంతదూరం నడిచి రావడం మీరు ఊహించుకోండి – శివుని పొగుడుతూ పాటలు పాడటం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న ఢంకాను వాయిస్తూ 1008 పద్యాలని అలా ఆశుకవిత్వముగా వినిపించాడు, అదే శివ తాండవ స్తోత్రం.. శివ తాండవ స్తోత్రం – తెలుగు పద్యాలు ఇంకా తాత్పర్యములు జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 || జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో – మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా – చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- శివుడు – మాకు సకల శుభములను ప్రసాదించుగాక. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 |...