పోస్ట్‌లు

ఆడ బిడ్డ విలువ

ఆడ బిడ్డ విలువ   అనురాగం , ఆప్యాయత కలగలసిన రూపం ఆడబిడ్డ,  అడుగు అడుగులోనూ ఆనందం,  మాట మాటలోనూ మమకారం పంచి,  ఆకలితో వస్తే అన్నం పెట్టే అన్నపూర్ణ ఆడ బిడ్డ ,  ఇంట్లో సందడికి , చికాకులోనూ చిరునవ్వుకి ,   ప్రేమకి ప్రతి రూపం ఆడబిడ్డ ,  అడ్డుగా ఉందని అలుసుగా చూస్తున్నా అండగా ఉండేది,  మృగంలా మారిన మనిషి కి మనస్సుని ఇచ్చి మార్చేది ,  ఎన్ని కష్టాలు వచ్చినా బంధాలకి బంధీగా నిలిచి నిలబడేది ఆడబిడ్డ  , చేతులు చాచి అర్థించాల్సిన బిడ్డనే చేయి వేసి చులకనగా చూస్తుంటే,  కన్నులతో పెట్టుకొని చూడాల్సిన బంధమే అదుపు తప్పి కామంతో చూస్తుంటే ,  కలలు నెరవేర్చాల్సిన వారే కడతెరుస్తుంటే కాస్త అయినా కనికరం లేని జీవితాలాను చూసి సిగ్గు పడాలా ,    ఇక చాలు నీదైన జీవితం వైపు ప్రయాణం సాగించు                  అధైర్య పడకు అలుసు కాదు నీ జీవితం  కటిక చీకటి మబ్బులు కమ్ముకొంటున్నాయి వెలుగు దీపాన్ని వెలిగించు ,  ఏ చేయి పట్టుకోలేని రీతిన నీ అడుగులు సాగించు , నీ గమ్యం నీ రేపటి భవిష్యత్ మరో జీవితానికి ఆదర్శ...

మనః శాంతి

 ఏమి మాటాడినా అపార్థం చేసుకొంటుంటే  ఏమి చేసినా తప్పే అంటుంటే ఇంక మాటాడటం మానేయలి, చేయడం ఆపేయాలి అప్పుడే మనసుకి శాంతి :- దేవ్✍️

రావణ బ్రహ్మ శివతాండవ స్తోత్రం శివోహా

చిత్రం
శివతాండవ స్తోత్రం శివతాండవ స్తోత్రానికి మూలం రావణుడు శివుని గొప్ప భక్తుడు, వారిద్దరి గురించి ఎన్నో కధలు ఉన్నాయి. ఒక భక్తుడు గొప్పవాడు కాకూడదు, కానీ రావణుడు గొప్పవాడయ్యాడు. దక్షిణం నుండి ఎంతో దూరం ప్రయాణించి కైలాసానికి చేరుకున్నాడు – అంతదూరం నడిచి రావడం మీరు ఊహించుకోండి – శివుని పొగుడుతూ పాటలు పాడటం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న ఢంకాను వాయిస్తూ 1008 పద్యాలని అలా ఆశుకవిత్వముగా వినిపించాడు, అదే శివ తాండవ స్తోత్రం.. శివ తాండవ స్తోత్రం – తెలుగు పద్యాలు ఇంకా తాత్పర్యములు జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 || జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో – మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా – చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- శివుడు – మాకు సకల శుభములను ప్రసాదించుగాక. జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2 |...

కదలని కథ

 మనిషిగా జననం మనీషి గా మరణం  కాలం తో ప్రయాణం ప్రేమానురాగాలతో గమనం విశ్వం అంతా నిండిన నయనం దేహం తో నిండిన ప్రాణం  నయనం తో  దేహం చలనం ఎటువైపుకో తెలుసుకోలేని జ్ఞానం:-దేవ్ 🖊

విలువ కోసం అన్వేషణ లో

చిత్రం
 ఆశలు , ఆశయాలు ఆత్మ సంతృప్తి ఆత్మ గౌరవం అన్నీ కూడా మనిషిగా నీ విలువ తెలిపేవి

మనసులో మాట

 మనస్సు పొరల్లో దాగిన మాటలు ఎన్నో పలకాలని వున్నా విలువలు లేని మనుషుల దగ్గర అసలు మాటలు దాచిపెట్టి  సంబంధంలేని మాటలు కలిపి విషయాన్నే మార్చేస్తూ మాటల గారడి చేయాలి లేక మౌనం గా ఉండిపోవాలి చేతనయిన వాళ్ళు ఎన్నో చేస్తున్నారు , చేయలేక మాధనపడుతూ ఎంతమందో :- దేవ్🖋

అజ్ఞానం

చిత్రం