ఆడ బిడ్డ విలువ
ఆడ బిడ్డ విలువ
అనురాగం , ఆప్యాయత కలగలసిన రూపం ఆడబిడ్డ,
అడుగు అడుగులోనూ ఆనందం,
మాట మాటలోనూ మమకారం పంచి,
ఆకలితో వస్తే అన్నం పెట్టే అన్నపూర్ణ ఆడ బిడ్డ ,
ఇంట్లో సందడికి , చికాకులోనూ చిరునవ్వుకి ,
ప్రేమకి ప్రతి రూపం ఆడబిడ్డ ,
అడ్డుగా ఉందని అలుసుగా చూస్తున్నా అండగా ఉండేది,
మృగంలా మారిన మనిషి కి మనస్సుని ఇచ్చి మార్చేది ,
ఎన్ని కష్టాలు వచ్చినా బంధాలకి బంధీగా నిలిచి నిలబడేది ఆడబిడ్డ
, చేతులు చాచి అర్థించాల్సిన బిడ్డనే చేయి వేసి చులకనగా చూస్తుంటే,
కన్నులతో పెట్టుకొని చూడాల్సిన బంధమే అదుపు తప్పి కామంతో చూస్తుంటే ,
కలలు నెరవేర్చాల్సిన వారే కడతెరుస్తుంటే కాస్త అయినా కనికరం లేని జీవితాలాను చూసి సిగ్గు పడాలా , ఇక చాలు నీదైన జీవితం వైపు ప్రయాణం సాగించు అధైర్య పడకు అలుసు కాదు నీ జీవితం
కటిక చీకటి మబ్బులు కమ్ముకొంటున్నాయి వెలుగు దీపాన్ని వెలిగించు ,
ఏ చేయి పట్టుకోలేని రీతిన నీ అడుగులు సాగించు ,
నీ గమ్యం నీ రేపటి భవిష్యత్ మరో జీవితానికి ఆదర్శం అయ్యేలా ఉజ్వలించు,
కలగా మిగిలిపోనీవ్వక నీలో కళ ని కదిలించు,
మనో ధైర్యం నీ తోడుగా నీ ఆశల వైపుగా పయనించు
, నీవంటూ తలచిన సాధ్యం కానిదే ముంది సృష్టికే మూలం నీవు కదా !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి